పయనించే సూర్యుడు మార్చ్ 19 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ముందస్తు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వార్డు పరిధిలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు నరేష్ గౌడ్ మరియు 6వ వార్డు కౌన్సిలర్ .జానాబాయి కలిసి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. పండుగ పూట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అని కొనియాడారు. ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈద్గా వద్ద అన్ని వసతులు కల్పిస్తున్నామని, వార్డు అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్ స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు