పయనించే సూర్యడు మర్చి. 19.2026 అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు నియోజకవర్గంలోని మాడగడలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్.జీ.ఎన్.ఆర్.ఈ.జీ.ఏ) పరిరక్షణ యాత్రలో భాగంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలపై చర్చించి, గిరిజన కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని వైయస్ షర్మిల రెడ్డికి అందజేస్తూ. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వినతి పత్రంలోని ముఖ్య అంశాలు. ఎన్నికల హామీలు అమలు కాలేదు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో గిరిజన సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఉద్యోగాలలో 100% రిజర్వేషన్ అమలు లేదు. గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్‌తో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. మెగా డి.ఎస్.సి లో సుమారు 5 వేల ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు దక్కలేదు.ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్ల సమస్య హెల్త్ అసిస్టెంట్ల నియామకాలను. రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు.దీని వల్ల గిరిజన విద్యార్థులలో సుమారు 200 మంది మరణించినట్లు పేర్కొన్నారు.1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు గిరిజన భూహక్కులను రక్షించే 1/70 చట్టానికి వ్యతిరేకంగా .జి.ఓ నెంబర్ 2,13,51లను తీసుకురావడం తీవ్రంగా వ్యతిరేకించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నంగా అభివర్ణించారు. ప్రధాన డిమాండ్లు. గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. మెగా డి.ఎస్.సి లో గిరిజనులకు న్యాయం చేయాలి. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ సిబ్బంది.నియామకాలు పూర్తి చేయాలి.జి.ఓ. నెంబర్ 2,13,51లను తక్షణమే రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి.గిరిజన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ బలంగా స్పందించి,రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గిరిజనులకు న్యాయం చేయాలని. వినతిపత్రంలో కోరారు.ఈ సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి స్పందిస్తూ గిరిజనుల సమస్య పరిష్కారానికి పోరాటం.చేసి కూటమి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి పార్టీ సీనియర్ నాయకుడు గుంజిడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు