డివిజన్ లో మౌలిక వసతులుకల్పించ డమే నా లక్ష్యం:రాగం నాగేందర్ యాదవ్.

పయనించే సూర్యుడు, మార్చి 19 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి డివిజన్… సందయ్య నగర్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు ను ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానికవాసులతో కలిసి ప్రారం భించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత డివిజన్ లోని ప్రతి కాలనీలలో,బస్తీల్లో గుంతల మయం లేకుండా సౌకర్యవంతమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి స్థానికవాసులకు వెసులుబాటుగా ఉండేందుకు కోట్లాడి రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లను వేయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. సీసీ రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విధ్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో అధిగమించామని ఇంకా ఏవైనా సమ స్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి నట్లైతే తక్షణమే సంబంధిత అధికారు లతో చర్చించి పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు.నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుడి, బడి నిర్మించి స్థానిక నిరుపేద కుటుం బాలకు అండగా ఉంటూ.. అందులో భాగంగా సైయింట్ ఫౌండేషన్ ద్వారా సెమీ స్కిల్ సెంటర్ లో రెండు వేల పై చిలుకు మహిళలకు వివిధ కోర్స్ లలో శిక్షణ కల్పించి వారికీ ఉపాధి కల్పించాన ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ అధ్యక్షులు బస్వరాజ్, ఎస్ ఎల్ వి డి సి ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ఆరంభ టౌన్షిప్ మాజీ అధ్య క్షులు బసవ య్య, కోదండరావు, సురభి కాలనీ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్, సబినా కుమారి, నీలకంఠ రెడ్డి, సౌజన్య, కల్యా ణి, జయ, రాములమ్మ, కుటుంబ రావు, నరసింహ రెడ్డి, నెంరామ్ చౌదరి, బలరాం వర్మ, సాంబశివరావు, శిరీష, డాక్టర్ మధు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అఫ్రీన్, లక్ష్మి జయలక్ష్మి స్థానికవాసులు తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *