పయనించే సూర్యుడు మార్చి 19, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ స్థాయిలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తిర్లాపురం గ్రామంలో సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు.గ్రామంలోని 4, 5 వార్డులలో డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచి, మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనుల ద్వారా గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఉమారాణి, చాపలమడుగు సైదులు, ఐతం సీత రాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసి సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.