దివ్యాంగులకు ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 19 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): ఏలేశ్వరం ఆర్టీసీ బస్ డిపోలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దివ్యాంగులందరూ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి,ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, బస్స ప్రసాద్, ఆస్పత్రి చైర్మన్ వాగు రాజేష్,రుచి రమేష్,ఎస్జీవిఎస్ సుబ్బరాజు, ఎండగుండి నాగబాబు, పెంటకోట మోహన్ ,పలివెల వెంకటేష్, గంగిరెడ్ల మణికంఠ, చందువోలు రాజా, సూతి బాబులు, జొన్నాడ వీరబాబు, యాళ్ల జగదీష్, వెలుగుల నాని, బుజ్జి రాజు, ఆర్టీసీ డిఎం, సిబ్బంది, నగర పంచాయతీ ఇంచార్జ్ కమిషనర్, కూటమి నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *