దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నేటినుంచి అమలు చేసిందని తెలిపారు. ఇప్పటికే మహిళా శక్తి పథకం ద్వారా, దివ్యాంగ మహిళలు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని, నేటి నుంచి 40% అంగవైకల్యం కలిగిన పురుషులు కూడా ఉచిత బస్సు ప్రయాణం అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ నాయుడు, ఆర్డీవో అప్పలరాజు, పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాల ఎంపీడీవోలు వసంత కుమార్, వెంకటరమణ, రమేష్ నాయుడు, పట్టణ టిడిపి కార్యదర్శి, అధ్యక్షులు సప్ప నవీన్, బడ్డ నాగరాజు, లోడగల కామేశ్వరరావు, దువ్వాడ శ్రీకాంత్, జోగ మల్లి, డొక్కరి శంకర్, మల్లిపెద్ది చిన్ని, గురుటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు తదితర నాయకులు పాల్గొన్నారు.