పయనించే సూర్యుడు, మార్చి 19, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్ , వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కోరుకున్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే పరాభవ నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని ఆయన అన్నారు. ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెళ్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.