నవోదయలో సత్తా చాటిన రెయిన్బో విద్యార్థులు

జిల్లాలో 1,8,10 వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

పయనించే సూర్యుడు-19-03-2026-రాజంపేట న్యూస్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో రాజంపేట పట్టణంలోని రెయిన్బో స్కూల్ విద్యార్థులు 1., 8., 10 వ ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారని కరస్పాండెంట్ రవీంద్రనాయుడు తెలియజేశారు. ఎస్.తనుష్ 100 కు 100 మార్పులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవగా,

పి.జయంతి 8 వ ర్యాంకు, ఎన్. సాయి కుశాల్ 10 వ ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో పోటీ పరీక్షలను సైతం ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు చిన్నతనం నుండే తర్ఫీదును ఇస్తామని తెలిపారు. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన పాఠశాల ఇంచార్జి ఎస్.ఆషిఫా మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.