నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి/19: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ .తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా గురువారం ఉదయం 10-30 గంటలకు ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరతారు. ఎల్ఎండీ కాలనీలోని శ్రీ తాపాళ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు పంచాగం శ్రవణం చేస్తారు. పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి రాశుల వారీగా ఫలితాలు, గోచార, గ్రహస్థితులను వారు వివరిస్తారు. ఈ పంచాగణ శ్రవణానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.