పయనించే సూర్యుడు మార్చి 19 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీఅలెర్మెల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల19న గురువారం నాడు సాయంత్రం 4:30 గంటలకు శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొరవి రామానుజాచార్యులు తెలిపారు. వివిధ ప్రాంతాలలోనీ భక్తులు ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొని శ్రీ పరాబావ నామ సంవత్సర వివిధ రాశుల ఫలితాలు, వర్షాలు, పంటలు, ప్రకృతి, మరియు వివిధ జన్మ నక్షత్రాలు జన్మరాశుల వారికి ఆదాయ, వ్యవయాలు, రాశి ఫలితాలు తెలపనున్నట్లు ఆయన తెలిపారు, భక్తులు మహిళలు ఉగాది పంచాంగ శ్రవణంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 8464990776 లో సంప్రదించాలన్నారు.
