పయని సూర్యుడు మార్చి 19 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి ప్రధాన కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిన్నటినుడి కురుస్తున్న అకాల వర్షలవల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతుకూలీ సంఘం (ఆర్ సి ఎస్) ఉమ్మడి మెదక్ జిల్లా కమిటి డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వాణిజ్యపంటలైన మొక్కజొన్న, మిర్చి, కందిచెన్లు, మామిడితోటలు, ఆహారపంటలైన వరి, కూరగాయలు, వడగళ్ల వల్ల నేలకు ఒరిగిపోయి ధ్వంసమైనాయి. రెక్కల కష్టం తోపాటుపంటకు పెట్టిన పెట్టుబడులు నష్టపోయిన రైతంగానికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి. రాష్ట్రంలో జిల్లాల వారిగా వ్యవసాయధికారులు తక్షణమే పంటనష్టం అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరుతున్నాం. పాలకుల వైఫల్యలే అనావృష్టి, అతివృష్టి వర్షాలకుకారణాలు. ప్రకృతి విధ్వంసంవల్ల రైతంగాం తీరని వేదనకు గురౌతుంది. శాస్త్రవేత్తలు, విద్యావంతులు, మేధావులు ప్రకృతివిధ్వంసం అపాలని ఎన్నివిన్నపాలుచేసిన పెడచేవినపెట్టినపాలకులు కార్పొరేట్ సంస్థలకు గుట్టలు, అడవులు దార దత్తంచేయడమే ఈ ప్రకృతి విలయానికి మూలం. రైతంగాం మనోధైర్యం కోల్పోవద్దని పంటల నష్ట పరిహారంకోసం పోరాడాలని రైతుకూలీ సంఘం (ఆర్ సి ఎస్) ఉమ్మడి మెదక్ జిల్లా కమిటి పిలుపునిస్తోంది.