పయనించే సూర్యుడు మార్చి 19, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడరూరల్, అధికారులు ఎంత మొద్దు నిద్దురలో ఉన్నారో ఏపిఐఐసి అధికారుల సమాధానాలు చూస్తుంటే తెలుస్తుంది. కాకినాడరూరల్ మండలంలో ఉన్న పెద్ద…పెద్ద పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకే క్వార్టర్స్ లేని దుస్తితి ఉంటే రమణయ్యపేట ఏపిఐఐసిలో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేస్తే కార్మికులకు పెద్ద..పెద్ద విశ్రాంతి ప్లాట్లు ఉన్నయని ఏపిఐఐసి జెడఎం స్వయంగా చెప్పడం విడ్డూరంగా ఉంది. కాకినాడరూరల్ మండలం రమణయ్యపేట ఏపిఐఐసిలో భహుళ అంతస్తుల భవనాలు నిర్మించారని, వాటికి అనుమతులు ఉంటే చూపించాల్సిందిగా పిజిఆరఎస్లో పిర్యాదు చేస్తే అలాంటి అనుమతులు ఇవ్వలేదని విచారణ నివేదికలో చెప్పి, నోటీసులు ఇచ్చామని చెప్పడం జరిగింది. దీనిపై ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో ఏపిఐఐసి జెడఎంకు ఫోన్ చేసి విచారణలో 9ఆవాసాలను గుర్తించి నోటీసులు ఇచ్చిన దానిపై వివరణ కోరగా అవి ఆవాసాలు కాదని, కార్మికులకు విశ్రాంతి గదులని సమాధానం చెప్పడంతో పాత్రికేయులు అవాక్కయ్యారు. అక్కడున్న స్థానికులందరికీ ఆ భహుళ అంతస్తుల భవనాలు అద్దెకు ఇస్తున్నారని తెలిసినా అధికారులకు మాత్రం తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఆవాసాలకు అనుమతి లేదని చెప్పిన నోటితోనే కార్మికుల విశ్రాంతి గదులని అధికారులు ఎలా చెప్పగలిగారో అర్దం కావడంలేదు. ఇక ఆవాశాల విషయానికొస్తే అసలు అక్కడ పరిశ్రమలే కనిపించడంలేదు. ఒక దగ్గర మాత్రం కింద వెళ్డింగ్ షాపులు ఉన్నాయి. ఆ షాపులో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో తెలియడంలేదు కాని ఏకంగా 4అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగింది. దీనిబట్టి అధికారుల చిత్త సుద్ది ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. అక్రమాలను వెలికితీయమని పిర్యాదు చేస్తే వారికే వత్తాసు పలుకుతున్నారంటే అధికారులకు ఎంతముట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మిక వాడలో ఇళ్ళు కడితే ప్లాన్ అప్రూవల్ అవసరం లేదు, పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అలాగే అనుమతులు కూడా అసవరం లేదు. ఇన్ని రాయితీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పారిశ్రామిక వాడలో ఇళ్ళు కట్టుకుంటే వాటిని కార్మికుల విశ్రాంతి గదులంటూ అధికారులు అబద్దాలు చెప్పి అందినకాడికి దండుకోవచ్చు. ఈ తంతు చూస్తుంటే ఏపిఐఐసి అధికారుల వల్ల న్యాయం జరగదని, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంగంలోనికి దిగాల్సి ఉంటుందని పిర్యాదు దారుడు వాపోతున్నాడు.