పిచ్చి కుక్కల దాడిలో 4 గర్రెలు మృతి

పయనించే సూర్యుడు మార్చి 19 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) పిచ్చికుక్కల దాడిలో 4గొర్రెలు మృత్యువాత పడగా,సుమారు 25గొర్రెలకు గాయలైన ఘటన దేవరుప్పుల మండలకేంద్రంలో చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తూ దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన తోటకూరిచినచంద్రయ్య,రాసాల బిక్షపతి జీవనం కొనసాగిస్తున్నారు.మంగళవారం గొర్రెలను కాస్తు తమకున్న పశువుల షెడ్డులో కట్టేసి వెళ్ళగా అర్ధరాత్రి ఎవ్వరు లేని సమయంలో పిచ్చికుక్కలు గొర్రెల మందపై వేర్వేరుగా తీవ్రంగా దాడులతో విధ్వంసం సృష్టించాయి.దీంతో 4 గొర్రెలు మృత్యువాత పడగా మరో 4గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని,ఇంకా 20గొర్రెలకు గాయాలయ్యాయని వాపోతున్నారు.దాదాపు నాలుగు లక్షల వరకు నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.గొర్రెలు మృత్యువాత పడటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని భావోద్వేగానికి గురయ్యారు.తమకు కుక్కల బెడద నుంచి గొర్రెలను రక్షించాలని బాధితులు తమ గోడును వెలబోసుకుంటున్నరు