పెద్దకొండామర్రిలో రైతన్న మీకోసం వారోత్సవాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 19.03.2026 మదనపల్లి అన్నమయ్య పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) రైతన్న మీకోసం వారోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దకొండామర్రి పంచాయతీ గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ శివశంకర్ పుంగనూరు వ్యవసాయ సంచాలకులు శివకుమార్లు ప్రసంగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన రసాయనక ఎరువులు ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చునని రాబోయే కాలంలో వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నందున రైతులు భూగర్భ జలాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు రైతులు బోరు బావుల కింద వరి సాగును మానుకొని ఆరుతడి పంటలకు మొ గ్గు చూపాలని అన్నారు డిమాండ్ ఆధారిత పంటల ప్రాముఖ్యతను వ్యవసాయంలో విలువ జోడింపు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కిసాన్ డ్రోన్స్ సబ్సిడీ విత్తన పంపిణీ వంటి సంక్షేమ పథకాలను గురించి రైతులకు వివరించారు రైతులందరూ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా రైతులకు వ్యవసాయ సమాచారం రైతుల భూమి వివరాలు వాతావరణం మార్కెట్ ధరలు వంటి కృత్రిమ మేధస్సు సహాయకం అందుబాటులో ఉంటుంది అని రైతులందరూ రైతు సేవా కేంద్రం సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు చంద్రమౌళి రామకృష్ణారెడ్డి గ్రామ వ్యవసాయ సహాయకులు జయంతి నవీన్ రైతులు పాల్గొన్నారు