పయనించే సూర్యుడు కోరుట్ల మార్చి 19 కోరుట్ల పట్టణంలోని మండల పరిషత్ కటికవాడ డి ఎన్ టి అయోద్యపట్నం పాఠశాలలు,జిల్లా పరిషత్ ఖాగజీపురా పాఠశాలల శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను మునిసిపల్ కమిషనర్ డి.రవీందర్,మండల విద్యాధికారి గంగుల నరేశం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మండల పరిషత్ కటికవాడ, డి ఎన్ టి అయోద్యపట్నం పాఠశాలలు,జిల్లా పరిషత్ ఖాగజీపురా పాఠశాలల తరగతులు కూల్చివేసేందుకు పరిపాలన అనుమతి పొందినందున వాటిని కూల్చివేసి వాటి స్థానములో నూతన తరగతి గదుల మంజూరు నిమిత్తం అనుమతుల గురించి పరిశీలన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షోగ్రాభి, ప్రధానోపాధ్యాయులు ఇఫ్తికర్ అహ్మద్,నాగరాజు,శ్రీధర్ లు పాల్గొన్నారు.