పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 19.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహించిన వేలంపాట ద్వారా రూ 34.47 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు కొండపై గల నాలుగు వనరులకు వేలంపాట జరిగింది కొండపైన క్యాంటీన్ ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ లను సంవత్సర కాలం పాటు విక్రయించుకునే హక్కును సోమశేఖర్ రూ 24.50 లక్షలు కొండ కింద విక్రయించుకునే హక్కును హరిబాబు రూ 7.51 లక్షలు అదేవిధంగా కొండపైన పాదరక్షకులు భద్రపరచుకునే హక్కును సుధాకర్ నాయుడు రూ 2.46 ల లక్షలు హెచ్చుగా పాట పా డి దక్కించుకున్నారని ఆయన వివరించారు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ ఆలయ అధికార అర్చక సిబ్బంది వేలంపాటలో పాల్గొన్నారు