బ్రాహ్మణుల మనోభావాలను కించపర్చవద్దు

పయనించే సూర్యుడు మార్చ్ 19 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్దశంకరంపేట బ్రాహ్మణుల మనోభావలను కించపర్చేవిధంగా వ్యవహరించవద్దని మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాయల కృష్ణశర్మ అన్నారు బుధవారం స్థానిక శివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులపై చేసిన వాఖ్యలు అర్థరహితమన్నారు ఈ వాఖ్యలను బ్రాహ్మణ సంఘం ఖండిస్తుందన్నారు ఎమ్మెల్యే సామెల్ బ్రాహ్మణులకు క్షమాపన చెప్పాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో అర్చకసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడి చంద్రశేఖరశర్మ సభ్యులు నాగరాజశర్మ రాజేశ్వరరావు సంతోష్ శర్మ రంగన్న సీతారాం సంగమేశ్వరశర్మ రాము గిరిధరశర్మ, ప్రభాకర్ రావు తదితరులున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *