మంత్రాలయం దివ్యాంగ-శక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభం

★ మంత్రాలయం ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 రిపోర్టర్ అభి మంత్రాలయం ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి బుధవారం మంత్రాలయం బస్సు స్టేషన్‌లో “దివ్యాంగ-శక్తి ఉచిత బస్సు” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఉచితంగా బస్సు ప్రయాణం పొందుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.6,000 రూపాయల పింఛన్, సబ్సిడీ రూపంలో మోటార్ వాహనాలు, ట్రై సైకిళ్లు కూడా అందిస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల అభ్యున్నతిని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంగా కట్టుబడి ఉందని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జీ లక్ష్మణ్, బీజేపీ ఇంచార్జీ విష్ణువర్ధన్ రెడ్డి, రామిరెడ్డి, వెంకటపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.