మతసామరస్యం – భారతీయతత్వానికి అద్దం పట్టిన

"అఖిల రాజ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో పాల్గొన్న తౌడ సత్యనారాయణ"

పయనించే సూర్యుడు మార్చి 19 రాజేష్ దౌల్తాబాద్) దుబ్బాక: భారతదేశం అనేది సర్వమతాలకు, సబ్బండ కులాలకు నిలయమై ప్రపంచానికి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్ద చీకోడ్ గ్రామంలో 70 ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలు శాంతి, ప్రేమ, సామరస్యాన్ని బోధిస్తాయని, అయితే మనుషుల స్వార్థం కారణంగా సమాజంలో అస్థిరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరస్పర గౌరవం, సహనం, అన్ని సంస్కృతుల పట్ల ఆదరణ వంటి విలువలు ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. అఖిల రాజ్ ఫౌండేషన్ అన్ని వర్గాల ప్రజలకు సేవలందించడంలో ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సేవా కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ దుబ్బాక నియోజకవర్గ కోఆర్డినేటర్ బిట్ల భాస్కర్, సర్పంచ్ కోమిరే నరేష్, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు బల్కం మల్లేశం, పోచయ్య, రాజనర్సు, అలాగే ఫౌండేషన్ సభ్యులు చంద్రం, రవి, షాదుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *