మాంత్రికి గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు.

కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు.

పయనించే సూర్యుడు మార్చి 19 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని మండల పరిధిలోని మాంత్రికి గ్రామాల్లో ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయకుడు కుమారుడు, కొంక సిద్ధార్థ నాయుడు , రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప టిడిపి నాయకులు రంగస్వామి నాయుడు , మాంత్రికి గ్రామంలో పర్యటన — రైతన్న… మీకోసం వారోత్సవాలు – డోర్ టు డోర్ | అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగిందిఆదోని మండల మంత్రికి గ్రామాల్లో నిర్వహించిన “రైతన్న… మీకోసం వారోత్సవాలు – డోర్ టు డోర్ అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో సిద్ధార్థ నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ :- ఈ సందర్భంగా రైతులను ఇంటింటికి కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అలాగే రైతులకు కరపత్రాలను అందజేసి, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఈ సంవత్సరానికి వ్యవసాయ ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రూ.20,000 ఆర్థిక సహాయం గురించి గ్రామస్థులకు, రైతులకు వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిద్ధార్థ నాయుడు చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, మండల అధ్యక్షులు శివప్ప, రంగన్న, లక్ష్మీనారాయణ, జిందా శంకర్, ఎక్స్ కౌన్సిల్ అంజి, సదుల్లా, గిడ్డయ్య, శంకర్, మాంత్రికి రాము, పెద్ద గిడ్డయ్య, గిడ్డయ్య, రామంజి, క్లస్టర్లు, యూనిట్లు బూత్ కన్వీనర్లు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.