మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి జాతర.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి .19.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గ, దేవీపట్నం మండలం పరిశీలకులు, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొల్లుబోయిన శ్రీనివాసు యాదవ్ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు పిలుపు. దేవీపట్నం మండలం గోందురు పరిధిలో వెలసిన మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 20-03- 2026 (శుక్రవారం) నాడు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శిరీష దేవి ముఖ్యఅతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవానికి కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు ఉదయం10:00 గంటలకు ఇందుకూరు పేట నుంచి ఎమ్మెల్యే కాన్వాయ్ తో భారీ సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమ వివరాలు. తేదీ:-20-03-2026 (శుక్రవారం) స్థలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంఅమ్మవారి కృపకు పాత్రులు కావాలని, క్రమశిక్షణతో ఈ జాతరను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోళ్ళ చంటిబాబు టీడీపీ మండల అధ్యక్షులు దేవీపట్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *