మున్సిపల్ కమిషనర్ జర ఇదర్ దేఖోజీ

సిపిఐ సూచన

పయనించే సూర్యుడు మార్చి 19 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) సీసీ రోడ్డు పోసి ఇరువైపులా మట్టి పోయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అలాగే పెరుగుతున్న కంపచెట్లు తక్షణమే తొలగించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుదు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. బుధవారం నాడు ఆయన నేరేడుచర్ల లోని వివిధ వార్డులలో ఉన్న సిసి రోడ్లను రోడ్డుకి ఇరువైపులా ఉన్న కంప చెట్లను సిపిఐ బృందంతో కలిసి పరిశీలించి న పిమ్మట ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ. ఒకపక్క మంత్రి అంతర్గత రోడ్లకు వందలాది కోట రూపాయలు కేటాయిస్తున్నామని రోడ్లకు మహర్దశ వస్తుందని చెబుతున్నారని అందుకు అభినందనలు తెలియజేస్తున్నామని కానీ పట్టణంలోని అంతర్గత సిసి రోడ్ల పట్ల అలాగే మండలoలో ఇటీవల కాలంలో వేసిన సిసి రోడ్లకు ఇరువైపులా మట్టి పోయడం లేదని ఎదురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగే పరిస్థితి లేదని ఇందుకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు. పట్టణంలోని అనేక చికెన్ దుకాణాల ముందు వ్యర్ధాలు పేరుకు పోతున్నాయని, వారు కనీసం డస్ట్ బిన్ ఉపయోగించకున్నా అడిగే నాధుడు లేడని, రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లు పెరిగి రోడ్డు మీదికి వస్తున్నాయని అటుపక్క కంప చెట్లు ఇటుపక్క కంపచెట్టు పెరగడం వల్ల వాహనాలకు పంక్చర్లు అవుతున్నాయని, తక్షణమే వాటికి తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులు అప్రమత్తంగా ఉండకపోతే పాలకులు బదనాం అవుతారని ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు ఆయన వెంట మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, సిపిఐ నాయకుడు శీలం రాంబాబు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *