మొక్కలు పెరిగే విధంగా బ్యాగ్ లలో విత్తనాలు పెట్టాలి.

* మండలం ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర : మొక్కలు పెరిగే విధంగా బ్యాగ్ లలో విత్తనాలను పెట్టాలని సాలూర మండల ఎంపీడీవో శ్రీనివాస్ నర్సరీ నిర్వాహకులు,క్షేత్ర సహాయకులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో సాలూర మండల కేంద్రం,ఫతేపూర్ గ్రామ నర్సరీలలో సందర్శించారు.మొక్కలను పెంచే విధానంపై నిర్వాహకులకు సూచనలు సలహాలు చేశారు.నిబంధనలను అనుసరిస్తూ మొక్కలను పెంచాలని తెలిపారు.మొక్కలు పెరగడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాలని పేర్కొన్నారు. మొక్కలను పెంచడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమయానుగుణంగా మొక్కలకు నీటిని అందించి మొక్కలు పెరగడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సాలూర గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి,గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్,క్షేత్ర సహాయకులు సయ్యద్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *