రంగారెడ్డి గూడ దళితవాడలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

★ సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన బీజేపీ నేత ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి ★ డీకే అరుణమ్మ నిధులతో అభివృద్ధి బాటలో రంగారెడ్డి గూడ గ్రామం _ సర్పంచ్ కాటేపాగ రేవతి ఆనంద్

పయనించే సూర్యుడు మార్చి 19, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డి గూడ గ్రామంలోని దళితవాడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణమ్మ ప్రత్యేక నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ కాటేపాగ రేవతి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా డీకే అరుణమ్మ నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్ కాటేపాగ రేవతి ఆనంద్ ఆధ్వర్యంలో గ్రామానికి డీకే అరుణమ్మ నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి పనులను, చేపడుతామని , రోడ్డు నిర్మాణంతో దళితవాడ ప్రజల చిరకాల సమస్య తీరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల అధ్యక్షులు కాటేపాగ ఆనంద్, గ్రామ సెక్రెటరీ కేశవులు, వార్డు మెంబర్లు మహేష్, సువర్ణ, పోచయ్య, నరేష్, చిన్న నరసింహులు, కృష్ణయ్య, యాదయ్య, వెంకటేష్, విజయ్, రమేష్, రామచంద్రయ్య, వెంకటయ్య మరియు స్థానిక గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.