రంజాన్ తోఫాల వితరణ.

★ తోఫాలను వితరణ చేసిన గ్రామ సర్పంచ్ నూర్ అహ్మద్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర : రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ పండగను సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముస్లిం మతస్తులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారు.ఈ సందర్భంగా బుధవారం సాలూర మండలం ఫతేపూర్ గ్రామంలో ముస్లిం మతస్తులకు గ్రామ సర్పంచ్ నూర్ అహ్మద్,ఉపసర్పంచ్ మోసిన్ ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మైనార్టీ మతస్తులకు రంజాన్ తొఫాలను వితరణ చేశారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ మతస్తుల తరపున రాష్ట్ర ప్రభుత్వం,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పండగలను శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మతస్తులు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.