పయనించే సూర్యుడు-19-03-2026-రాజంపేట న్యూస్ : పట్టణ పరిధిలోని నూనెవారిపల్లె మరియు వెంకటపల్లె రోడ్డులో ఉన్న రాజు హై స్కూల్ మొదటి మరియు రెండవ బ్రాంచిలలో బుధవారం ముందస్తు ఉగాది వేడులను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయక స్వామికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజు హై స్కూల్ సీఈఓ గుంటిమడుగు రఘురామరాజు, మొదటి బ్రాంచి ప్రధానోపాధ్యాయులు వి.మోహన్ రెడ్డి, రెండవ బ్రాంచి ప్రధానోపాధ్యాయులు గోళ్ల బాలగంగాధర్, ఏఓ మల్లారెడ్డి లు ఉగాది విశిష్టతను తెలియజేశారు. తెలుగువారికి నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగను విద్యార్థులు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. పరాభవ నామ సంవత్సరంలో విద్యార్థులందరికీ మంచి జరిగి ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని ఆకాంక్షించారు. ఉగాదిని పురస్కరించుకొని పలువురు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. ఈకార్యక్రమంలో రాజు హై స్కూల్ మొదటి బ్రాంచ్ లోయర్ సెక్షన్ ఇంచార్జ్ హబీబ్, రెండవ బ్రాంచ్ అగ్రిగేటర్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.