రామగిరిలో ఘనంగా చంద్రుపట్ల రాంరెడ్డి జయంతి వేడుకలు

* మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు * కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తక్షణమే అమలు చేయాలని మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -19 రామగిరి మండలంలో బిజెపి మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంథని మాజీ శాసనసభ్యులు చంద్రుపట్ల రాంరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాంరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి బిజెపి శ్రేణులు నావాళులు అర్పించారు.ఈ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైనందున వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసిస్తూ మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం కొండు లక్ష్మణ్ మాట్లాడుతూ మంథని ప్రాంతానికి రామ్ రెడ్డి ఐదు సంవత్సరాలు శాసనసభ్యునిగ ఎనలేని సేవలు చేశారని రైతు పక్షపాతిగా మరియు ప్రజల మనిషిగా ఆయన ఒక గుర్తింపు పొందారని కల్మషం లేని రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల మనసులు గెలుచుకున్న గొప్ప వ్యక్తి ఆయన అని ఈ మధ్య కాలంలో ఆయన మనందరి నుండి భౌతికంగా దూరం అవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన రాజకీయ స్ఫూర్తితోనే రాజకీయంలో ముందుకు వెళ్తామన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని మ్యానిఫెస్టోలో హమీలిచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని ఇప్పుడు హామీలను నెరవేర్చకుండా మాయ మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని పేదల ఇండ్లను కూల్చడంలో ఉన్న ఆరాటం పథకాలు అమలు చేయడంలో లేదని రైతు భరోసా ఇవ్వకుండా ఇదిగో అదిగో అంటూ ఆశ చూపుతూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోట్ల రాజు, ఉపాధ్యక్షుడు నాంసాని మహేష్, పట్టణ అధ్యక్షుడు చిదురాల శివ, కార్యదర్శి కొత్త కమలాకర్, బిఎంఎస్ నాయకులు జానీ,ఓబీసీ అధ్యక్షుడు మైదం సందీప్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ముక్కెర మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *