రైతు భరోసా కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

* మండల వ్యవసాయ అధికారి శ్వేత.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించే పంటల పెట్టుబడి సహాయార్థం అందిస్తున్న రైతు భరోసా పొందడానికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.యాసంగి 2025 – 26 సీజన్ కు సంబంధించి రైతు భరోసా కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.పట్టాదారు పాసుబుక్ లు పొందిన రైతులు వారి ధృవపత్రాలు జోడించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.ఇది వరకు రైతు భరోసా పొందిన రైతులు దరఖాస్తులు చేసుకోవలసిన అవసరం లేదన్నారు.రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారిని సంప్రదించాలని సూచించారు.పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ బుక్ సమర్పించవలసి ఉంటుందని వెల్లడించారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *