వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవం.

తెలుగుదేశం పార్టీ, జనసేనపార్టీ బిజెపి పార్టీల ఇన్చార్జులు ఎన్ రాఘవేంద్ర రెడ్డి, వాల్మీకి బి లక్ష్మన్న, ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి.

పయనించే సూర్యుడు మార్చి 19 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ ఆర్టీసీ బస్టాండ్ లో దివ్యాంగుల( వికలాంగుల) కొరకు ప్రయాణం చేయుటకు ఉచిత బస్సు సౌకర్యము ప్రారంభోత్సవం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న, బిజెపి ఇన్చార్జ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల అప్పుడు ఇచ్చిన వాగ్దానలే కాకుండా మరియు ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇందులో భాగంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులుసురేష్ నాయుడు, టిప్పు సుల్తాన్, వెంకటపతి రాజు, చావడి వెంకటేష్, బసలదొడ్డి ఈరన్న, పల్లిపాడు రామిరెడ్డి, ఎన్ రాకేష్ రెడ్డి, నాడిగిన అయ్యన్న, వరదరాజులు, వెంకటేష్, పంచాయతీ సెక్రెటరీ ఉపేంద్ర జనసేన పార్టీ నాయకులు లక్ష్మారి ఏసోబు,తెలుగుదేశం,జనసేన పార్టీ, బిజెపి పార్టీ నాయకులు మరియు ఆర్టీసీ ఆఫీసర్స్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *