విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి ఎస్ఐ అజయ్ కుమార్

పయనించే సూర్యడు మార్చి 19 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు విద్యార్థుల ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ఆదిశ గా అడుగులు వేయాలని నడిగూడెం మండల ఎస్ఐ అజయ్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్ లు సూచించారు. బుధవారం నడిగూడెం లోని ఎస్ వి ఆర్ టెక్న్నో స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో వారు పాల్గొన్ని మాటాడుతూ… విద్యార్థులు పాఠశాల దశలోనే ఒక లక్ష్యం నిర్ణయించుకోని ఆ దిశగా అడుగులు వేసి భవిష్యత్తు లో విజయం సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాల కు మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల కారెస్పాండెంట్ ఉపేందర్, ప్రిన్సిపాల్ వెంకటరమణ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *