పయనించే సూర్యుడు మార్చ్ 19 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వెన్నంపల్లి గ్రామంలో బుధవారం ముస్లింలకు 'ఈద్ కా తోఫా' కానుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, వార్డు సభ్యులు సారబుడ్ల లింగారెడ్డి, కొంపల్లి ప్రశాంత్ రెడ్డి, మొలుగురి వనిత- రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి సుధాకర్ రెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, తాడిచర్ల కుమార్, బిస నరసయ్య, రేగుల బిక్షపతి,బండ శివానందరెడ్డి, కొంపెల్లి అనిల్ రెడ్డి, మారుపాక సుమన్, సంగాల మహేష్, ముస్లిం సోదరులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.