వేదమంత్రాలను అవమానించిన ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌ బ్రాహ్మణులకు మరియు హిందువులకు క్షమాపణ చెప్పాలి

★ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారథి

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి -19 వేదమంత్రాలను తిట్లుగా అభివర్ణిస్తూ అవహేళనాత్మకంగా మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వాఖ్యలు అత్యంత బాధాకరమైనవి, అసహ్యకరమైనవిఈ వ్యాఖ్యలు మంత్రాలు చదివిన బ్రాహ్మణులతో పాటు హిందువుల మనోభావాలను గాయపరిచేవిగా ఉన్నాయని వీటిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారథి అన్నారు. వేల సంవత్సరాలుగా ఈ దేశపు నాగరికతకు దిక్సూచిగా నిలిచిన వేదమంత్రాలను తిట్లుగా చిత్రీకరించడం వారి అవివేకం మాత్రమే కాదు, కోట్లాది హిందువుల విశ్వాసాలను కించపరచే చర్య. కులపరంగా, దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేగా పదవి పొందిన సామ్యూల్ క్రైస్తవ మతాన్ని అనుసరించే పేరుపెట్టుకుని, హిందూ సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బ్రాహ్మణులకు మరియు హిందువులకు క్షమాపణలు చెప్పి తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.