శ్రీ పరాభవ నామ సంవత్సరం నగర ప్రజలందరి పరాభవాలు దూరమై విజయాలు ధరిచేరాలని నగర్ ప్రజకు శుభాకాంక్షలు తెలిపిన

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 19 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ లో బుధవారం రోజు పత్రిక ప్రకటనలో మా ట్లాడుతూ కొత్త ఊహాలకు ఊపిరినింపుతూ.. కొత్త ఆశలను చిగురింపజేస్తూ కొత్త తెలుగు సంవత్సరం నేటితో ప్రారంభమైందని అన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు, అధికారులకు తెలుగు నూతన సంవతర శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ ఉగాది పండగ పర్వదినాన్ని ప్రజలందరు కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. సంతోషం, సంబరం, సుఖం, సౌభాగ్యం ప్రజలందరీ తోడుగా నీడలా నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నూతన పరాభవ సంవత్సరం ప్రజలందరీకి అన్నీంటా కలిసిరావాని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, ప్రగతి సంక్షేమ ఫలాలు అందాలని తెలంగాణ రాష్ట్రం లో కరీంనగర్ నగరపాలక సంస్థ ఆదర్శంగా నిలవాలని అన్నారు ఆరు రుచుల ఆనంద వేడుకైన ఉగాది పండగ పర్వదినాన్ని అనురాగ ఆప్యాయతల మద్య జరుపుకొవాలని తెలిపారు