శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్‌కు ఆహ్వానం

పయనించే సూర్యుడు నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ 19-03-2026 తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం, గొల్లలమామిడాడ గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండ రామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్‌ను ఆలయ కమిటీ బుధవారం అధికారికంగా ఆహ్వానించింది. ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ షన్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కల్యాణోత్సవ పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్ల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. పట్టువస్త్రాల సమర్పణ: ఆచారం ప్రకారం, కల్యాణోత్సవం రోజున కలెక్టర్ దంపతులు కోదండ రాముడికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.