సాలుర గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్.

* పండ్లు తినిపిస్తున్న గ్రామ పెద్దలు సొక్కం రవి.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సాలూర గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మండల కేంద్రంలోని ప్రార్థనా మందిరంలో బుధవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ముస్లిం సోదరులకు గ్రామ పెద్దలు సొక్కం రవి పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ కు ముస్లిం మత పెద్దలు,మతస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామం సుభిక్షంగా గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముస్లిం ప్రజలు ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ముస్లిం మతస్తులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *