ఉగాది సందర్భంగా గ్రామ దేవత మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

పయ నించే మార్చ్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొత్త అమావాస్య పండుగ సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి శ్రీ సూక్తం విధానంగా 9 రకాల పండ్ల రసాల తోటి పండితుల సమక్షంలో బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు మరియు నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు తొలిత వినాయకుని పూజ, శ్రీ సూక్తులు నవార్ణిక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద పులిహార ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అమావాస్య గ్రామదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు కావున గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకరణ చేయడం జరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా పల్లకి సేవ చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి నీ దర్శించి పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బాల శ్రీనివాస్, పవన్ కుమార్, శ్రీకాంత్, సాయి చైతన్య, తాత పుడి పండు, సంసాని పాండురంగారావు, కొత్తగుండు సత్య భాస్కర్ రావు, సంసాని రాంబాబు, తాతపూడి బుల్లి, ఆ కొండి వెంకట సుబ్బారావు, సంసాని కాసు లు, వేదుల శ్రీను, ఆ కొండిరవి , సుంకర పవిత్ర , సుంకర బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. అడపా రమేష్ ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గ్రామ దేవత