పయనించే సూర్యుడు మార్చి 20 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్‌లో అడిషనల్ ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రిత్విక్ సాయి ని హెడ్ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షులు జాదవ్ శ్రీనివాస్ కార్యదర్శి రాథోడ్ ఉపేందర్ వారు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా 22 మార్చి 2026న డ్రగ్స్ వద్దు – ఆటలే ముద్దు అనే నినాదంతో నిర్వహించనున్న ఒకరోజు క్రికెట్ లీగ్ కార్యక్రమానికి విచ్చేసి యువతను ప్రోత్సహించాలని ఆహ్వానించారు ఈ సమావేశంలో సంస్థ సభ్యులు మహేందర్ వేణు బాలకృష్ణ పందిరి భీమన్న ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.