ఎరాజ్ పల్లిలో కుస్తీమే సవాల్

★ గెలిచినా మల్లయోధులకు నగదు అందచేస్తున్న గ్రామ పెద్దలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 20 బోధన్ : బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి.కుస్తీలు పట్టడానికి వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు భారీగా తరలివచ్చారు.కుస్తీ పోటీలను తిలకించడానికి పలు గ్రామాల ప్రజలు ఎరాజ్ పల్లికి భారీగా వచ్చారు.ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్ల యోధులకు గ్రామ పెద్దలు నగదు పురస్కారాన్ని అందజేశారు.కుస్తీ పోటీలు ముగిసిన తర్వాత భాజా భజంత్రీలతో ఊరేగింపుగా గ్రామంలోని హనుమాన్ మందిరం వద్దకు చేరుకున్నారు.హనుమాన్ మందిరం వద్ద పంచాంగ శ్రవణం పటించారు.గ్రామం సుభిక్షంగాను గ్రామ ప్రజలు సంక్షేమంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసు గౌడ్,గ్రామ పెద్దలు,యువకులు,వివిధ గ్రామాల ప్రజలు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.