కుతుకులూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు..!

పయనించే సూర్యుడు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ 20 అనపర్తి నియోజకవర్గం, కుతుకులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గురువారం నాడు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు మరియు ముఖ్య కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు. నాయకుల సమక్షంలో చేరిక: స్థానిక నాయకులు కత్రి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మనోజ్ రెడ్డి పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కోసం యువత ముందడుగు: గ్రామ అభివృద్ధి మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు యువకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొని నినాదాలు చేశారు.