పయనించే సూర్యుడు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ 20- నియోజకవర్గంలోన కరకుదురు గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతంలో సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్థుల కష్టాలు తీరనున్నాయి. సుమారు కోట్లాది రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఇవే: బిటి రోడ్ల నిర్మాణం: రూ. 2 కోట్ల 40 లక్షల భారీ నిధులతో అరెట్లకట్ట-కరకుదురు మరియు కైకవోలు-కరకుదురు మధ్య అత్యాధునిక బిటి రోడ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. వైద్య సౌకర్యాలు: గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రూ. 55 లక్షలతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. తాగునీటి వసతి: ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 10 లక్షల నిధులతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రావెల్ రోడ్లు: రూ. 55 లక్షలతో అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. గతంలో రవాణా సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో కరకుదురు గ్రామం సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది.