పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 20 మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మనిషి జీవనం ప్రకృతితో మమేకమై ఉంది.. ప్రకృతిలో వచ్చే మార్పులకు ప్రతిరూపాలే సాంప్రదాయాలు సంస్కృతులు పండుగలు.. వసంత రుతువులో వచ్చే ఈ ఉగాది ప్రకృతిలోని తీపి చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం ల షడ్రుచుల సమ్మేళనాన్ని సూచిస్తుంది… ఈ షడ్రుచులు జీవితంలోని వివిధ భావోద్వేగాలను సూచిస్తూ జీవితం మిశ్రమ భావాలతో కూడుకున్నదని గుర్తు చేస్తుంది.. ప్రతి వ్యక్తి తమ జీవితంలో సహనం తో వినయం తో అన్నింటిని సమానంగా స్వీకరిస్తూ వ్యక్తి గా శక్తి గా అభివృద్ధి చెందాలని, ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.