పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 20 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో విప్లవ వీరులు గా వెలుగొందిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని వర్ధంతి సభలకు సంబంధించిన పోస్టర్లను ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో పేటలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బాడిశ లక్ష్మణరావు, వాసం బుచ్చిరాజు మాట్లాడుతూ మార్చి 23 నుండి 30 వరకు వాడవాడలా వర్ధంతి సభలు నిర్వహించి, విప్లవ వీరుల ఆశయాలను చాటిచెప్పాలని పిలుపు నిచ్చారు. 1931 మార్చి 23న బ్రిటీష్ సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖేవ్ ల త్యాగాలు వెలకట్టలేనివని కొనియా డారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడు తోందని, విద్యను వ్యాపారం చేస్తోందని ఆరోపిం చారు. దేశంలో ఏటా 70 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, నిరుద్యోగ భారతం తో యువత భవిష్యత్తు అంధకార మవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2020 నూతన విద్యా విధా నాన్ని రద్దు చేయాలని, విద్య, ఉద్యోగ అవకాశాల కోసం యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు కుంజ అర్జున్, కారం సీతారాములు, కంగాల వంగారావు, కారం తులసి తదితరులు పాల్గొన్నారు.