పయనించే సూర్యుడు మార్చ్ 20 నేరేడుచర్ల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) మండలంలో నూతన సంవత్సరం ఉగాది పర్వదినం (శ్రీ పరాభవ నామ సంవత్సరం) వేడుకలు ,ప్రజలు దేవాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో పాడిపంటలు బాగుగా పండి, పిల్లా పాపలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దేవాలయంలో ప్రజలు వేడుకున్నారు. అనంతరం నూతన పంచాంగ శ్రవణం పూజారులు నిర్వహించారు.