రాజమహేంద్రవరంలో ఘనంగా శ్రీ ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం

పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మరియు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

పయనించే సూర్యుడు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్) 20 రాజమహేంద్రవరంలోని జె.కె గార్డెన్స్‌లో శ్రీ ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం అట్టహాసంగా నిర్వహించబడింది. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేసిన పలువురు కవి పండితులను, కళాకారులను మరియు సన్మాన గ్రహీతలను ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *