2003 -2004పూర్వ విద్యార్థులు ఫోకస్ రూప్ లైట్లను వితరణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 20 బోధన్ : సాలుర మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల సేవాభావం ప్రతిఫలించింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2003–2004 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి ఒంటి హనుమాన్ ఆలయానికి ఫోకస్ రూప్ లైట్లను అందజేశారు. ఆలయ ప్రాంగణం ప్రకాశవంతంగా ఉండేలా ఈ లైట్లను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు పూర్వ విద్యార్థుల సేవను అభినందించారు. సమాజానికి తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగించాలని స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి శంకర్ పూర్వ విద్యార్థులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *