పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 21 పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన విఫ్తార్ విందులో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పొందూరు సుధాకర్ సుమారు 600 మంది ముస్లిం సోదర, సోదరీమణి ల కోసం విఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్లిం మత గురువులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ఉపవాస దీక్షను విరమిస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం శాంతి, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాగే అన్ని మతాల ప్రజలు సౌహార్దంతో జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అత్తులూరి అచ్యుత రావు , గ్రామ అధ్యక్షులు వల్లం కొండ నరసింహారావు , మాజీ అధ్యక్షులు మురళి , ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సొందుమియా, మొగల్ మస్తాన్, షేక్ బాజీ,మంజుల మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.