పయనించే సూర్యుడు మార్చ్ 20 నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రామనాథ్, మెడిసం రాజు పార్టీ నాయకులు మరియు కార్యకర్తల తో జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పేదలు, రైతులు, యువతకు ఉపయోగపడే ఈ హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇకపై కూడా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శాంతియుత మార్గంలో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమాలు అవసరమైతే మరింత తీవ్రతరమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిపాలన వెంటనే స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.