కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలన

పయనించే సూర్యుడు:మార్చి 21/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సుమారు 100 కోట్ల రూపాయల వ్యయం తో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు సుమారు ఇప్పటివరకు 60% పనులు పూర్తి కావస్తున్నాయి అని తెలిపారు ఆధునిక నూతన మలేషియా టెక్నాలజీ తో నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు వేంసూరు మండల రైతులకు పంటలు ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది అని తెలిపారు వేంసూరు మండలం లో మరియు కల్లూరుగూడెం ప్రాంత పరిసరాల్లో భూములు రేటు బాగా పెరిగాయి అని రైతులు సంతోషం గా వున్నారు అని తెలిపారు పామాయిల్ ఫ్యాక్టరీ వలన ఏటువంటి కాలుష్యం జరగకుండా టెక్నాలజీ వాడాలి అని కాంట్రాక్టర్ కు సూచించారు లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ వలన ఉద్యోగ అవకాశాలు మరియు రోజువారి పనులు వేతనం దొరుకుతుందని తెలియజేశారు అతి త్వరలో వేంసూర్ మండలంకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయని వేంసూరు మండలం పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని తెలియజేశారు ఎమ్మెల్యేరాగమయి దయానంద్ ఈ సందర్భంగా రైతులందరూ తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కి, రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మరియు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమం లో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గొర్ల సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు వెల్ది జగన్ మోహన్ రావు, గంగాధర్ రావు, కుక్కపల్లి శ్రీను, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సంబంధిత అధికారులు మరియు వెంసూరు మండల గ్రామ సర్పంచులు, రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు