పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 21 వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్ అంటూ చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు హెచ్చరించారు.ఆయన చండూరులో గురువారం స్థానిక నాయకులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు.రిమాండ్ కు పంపబడ్డ 16 మందిలో 12 మంది బిఆర్ఎస్ నాయకులు ఉండగా కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్నారు. చండూరులో బిఆర్ఎస్- బిజెపి నాయకులకు అక్రమ సంబంధం ఉండడంతో బిఆర్ఎస్ ను నిందించకుండా కేవలం కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతూ కాంగ్రెస్ గుండాలంటూ మాట్లాడుతున్నారు అన్నారు. కావాలనే కోమటిరెడ్డి బ్రదర్స్ కోడి బ్రదర్స్ పైన నిందలు మోపుతూ పిచ్చలవిడిగా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో 12 విడతల్లో 1970 మందికి కంటి ఆపరేషన్ చేయించారని అందులో 400 కుటుంబాలకు పైగా బిజెపి కుటుంబాలే ఉన్నాయన్నారు. బిజెపి నాయకులు కళ్ళుండి చూడలేని కబోదులు అన్నారు. డాక్టర్ జి.మనోహర్ రెడ్డి,నాగ వర్షిత్ రెడ్డి కూడా వస్తే వారికి కూడా కంటి ఆపరేషన్ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చండూరులో ఉండే ప్రశాంత వాతావరణన్ని బిజెపి నాయకులు చెడగొడుతున్నారని బిజెపి నాయకులు రెచ్చగొడితే సహించేది లేదని త్వరలోనే అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టి తిరిగి చండూరులో ప్రశాంత వాతావరణ నెలకొలుపుతామన్నారు.