పయనించే సూర్యుడు, మార్చి 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార) తెలుగు నూతన సంవత్సరం 'శ్రీ పరా భవ' నామ ఉగాది పర్వదినాన్ని పుర స్కరించుకుని హైదర్ నగర్ డివిజన్‌లో. కిందికుంట పార్క్‌లో తెలుగు భాషా ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా కార్పొరేటర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉగాది సందర్భంగా హైదర్ నగర్ డివి జన్ తాజా మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావుకి ఈ కార్యక్రమంలో ఘన సన్మానం జరిగింది. డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని ప్రజలకు అందించిన సేవలను గుర్తించి, స్థానిక నివాసితులు నాయకులు ఆయ నను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అభివృద్ధి పనుల ప్రస్తావన: తన పదవీ కాలంలో హైదర్ నగర్ డివిజన్ పరిధి లోని కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన, పార్కుల అభివృద్ధి పారిశుధ్య పనులపై నార్నే శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు గాను ఈ గౌరవం దక్కింద ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రతినిధులు, తెలుగు భాషా అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.